పుర పోరు.. ఏర్పాట్ల జోరు
ఎన్నికల అధికారుల
విధులు ఇలా..
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసేందుకు మున్సిపల్ అధికారులను ఆదేశించాం. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడిచ్చిన అందుకు సిద్ధంగా ఉన్నాం. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులకు, పోలీసులకు రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలి.
– సిక్తాపట్నాయక్, కలెక్టర్, నారాయణపేట
నారాయణపేట: ఏ క్షణమైనా బల్దియా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండటంతో మున్సిపల్ అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడం.. నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారుల ఎంపిక చేసి శిక్షణ సైతం ఇచ్చారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించి పేపర్లు, వైట్, ఎల్లో, గ్రీన్, బ్రౌన్, బ్లూ, పింక్ కవర్లు, ఇంకు, పేపర్ సీళ్లు, ట్యాగ్స్, అభ్యర్థులకు సంబంధించి ఎన్నికల నిబంధనల బుక్స్, ఇతర సామగ్రి కార్యాలయాలకు చేరాయి. నామినేషన్లు స్వీకరించే కార్యాలయాలు, స్ట్రాంగ్‌రూంలు, కౌంటింగ్ సెంటర్ల కోసం భవనాల ఎంపిక సైతం అధికారులు పూర్తి చేశారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను గుర్తించి, వాటిలో ర్యాంపులు, లైటింగ్, ఫర్నీచర్, ఇతర సదుపాయాలు కల్పించనున్నారు.
ఆర్‌ఓలదే బాధ్యత..
ఈసారి మూడు వార్డులకు ఒక రిటర్నింగ్ అధికారిని కేటాయించారు. అందులోనూ గెజిటెడ్ హోదా ఉన్నవారినే ఆర్వోలుగా నియమించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఫలితాలు వెలువడే వరకు ఆయా వార్డులకు ఆర్వోలే బాధ్యత తీసుకుంటారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, ప్రతి మున్సిపాలిటీకి 20 శాతం అదనంగా ఆర్వోలు, ఏఆర్వోలను నియమించారు. ముఖ్యంగా ఎన్నికల ఫలితాల అనంతరం కౌన్సిలర్లుగా ఎంపికై న వారికి ధ్రువపత్రాలు అందజేసే వరకు ఆర్‌ఓ బాధ్యుడిగా ఉండాలి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 72 వార్డులు ఉన్నాయి.
మద్దూర్ మున్సిపాలిటీలో..
మద్దూర్ మున్సిపాలిటీలో 16 వార్డులకు గాను 6 నామినేషన్ల కేంద్రాలు, నలుగురు జోనల్ అధికారులు, 42 బ్యాలెట్ బాక్సులు, కౌంటింగ్ కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయనున్నారు.
కోస్గి మున్సిపాలిటీలో..
కోస్గిలో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో 8 కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. జోనల్ అధికారులు నలుగురు, బ్యాలెట్ బాక్సులు 82, కౌంటింగ్ కేంద్రం ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్నారు.
మక్తల్ మున్సిపాలిటీలో..
మక్తల్‌లో నామినేషన్ కేంద్రాలు 8, జోనల్ అధికారులు నలుగురు, 76 బ్యాలెట్ బాక్సులు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
నారాయణపేట మున్సిపాలిటీలో..
నారాయణపేటలో నామినేషన్ కేంద్రాలు 4, జోనల్ అధికారులు 8 మంది, బ్యాలెట్ బాక్సులు 140, కౌంటింగ్ కేంద్రం యాద్గీర్ రోడ్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఏర్పాటు చేయనున్నారు.
జిల్లాలో వార్డులు ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు
మున్సిపాలిటీ వార్డులు పీఎస్‌లు ఆర్వోలు ఏఆర్వోలు
నారాయణపేట 24 56 10 10
మక్తల్ 16 38 08 08
కోస్గి 16 34 08 08
మద్దూర్ 16 21 06 06
మొత్తం 72 149 32 32
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు..72 వార్డులు
నామినేషన్ స్వీకరణ కేంద్రంలో రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల పత్రాల స్వీకరణ, పరిశీలన చేయనున్నారు. మెన్‌పవర్ మేనేజ్మెంట్, వెబ్ కాస్టింగ్, కోడ్ అమలు, వ్యయ పరిశీలన, సహాయ కేంద్రం, ఫిర్యాదుల పరిశీలన, బ్యాలెట్ బాక్సులు, పేపర్లు, ట్రాన్స్‌ఫోర్ట్, శిక్షణ నిర్వహణ, మెటీరియల్ నిర్వహణ, మీడియా కమ్యూనికేషన్, నివేదికల తయారీ తదితర విధులకు సంబంధించి నోడల్ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపునకు పోలీసు అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు.
ఎన్నికలకు యంత్రాంగం సన్నద్ధం
149 పోలింగ్ కేంద్రాలు,
32 మంది ఆర్‌ఓలు
ఎన్నికలు ముగిసే వరకు
ఆర్వోలదే పూర్తి బాధ్యత
పోలింగ్ కేంద్రాల్లో వసతుల ఏర్పాటు


