ఎత్తిపోతల స్టేజ్‌–1 పంపుహౌజ్‌ పనులు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఎత్తిపోతల స్టేజ్‌–1 పంపుహౌజ్‌ పనులు ప్రారంభం

Feb 2 2026 8:17 AM | Updated on Feb 2 2026 8:17 AM

ఎత్తిపోతల స్టేజ్‌–1 పంపుహౌజ్‌ పనులు ప్రారంభం

ఎత్తిపోతల స్టేజ్‌–1 పంపుహౌజ్‌ పనులు ప్రారంభం

మక్తల్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మక్తల్‌–నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల పథకంలో భాగంగా స్టేజ్‌–1 పంపుహౌజ్‌ నిర్మాణానికి ఆదివారం మండలంలోని కాటేవ్రుపల్లి దగ్గర ఇరిగేషన్‌శాఖ ఎస్‌ఈ శ్రీధర్‌ భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎత్తిపోతల నిర్మాణానికి రాష్ట్ర ప్రభు త్వం సుమారు రూ.1,400 కోట్లు మంజూరు చేసిందన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవతో రైతులకు ఎకరాకు రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించిందని చెప్పారు. పనులు యుద్ధపాతిపదికన చేపట్టాలని కాంట్రాక్టర్‌ రాఘవకు సూచించారు. కార్యక్రమంలో ఈఈ గోపాల్‌చారి, ఏఈఈ నాగశివ, ఎండి ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement