పేటలో కొలిక్కి.. | - | Sakshi
Sakshi News home page

పేటలో కొలిక్కి..

Feb 3 2026 7:18 AM | Updated on Feb 3 2026 7:18 AM

పేటలో కొలిక్కి..

పేటలో కొలిక్కి..

జిల్లాకేంద్రమైన నారాయణపేట మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో పోటీచేసే అభ్యర్థులకు రెండు రోజుల క్రితం బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి బీ ఫారాలు అందజేశారు. కాంగ్రెస్‌ పార్టీ మిలాఖత్‌లో ఎంఐఎంకు 23, 24 వార్డులను వదులుకోవడంతో.. మిగిలిన 22 వార్డుల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. సోమవారం డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి, ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా అభ్యర్థులకు పార్టీ బీ ఫారాలను అందజేశారు. బీజేపీలో అభ్యర్థులను ప్రకటించి నామినేషన్లు వేసినప్పటికీ.. రెండు వార్డుల్లో అభ్యర్థుల రెబల్స్‌తో బీ ఫారాలు ఇవ్వలేకపోయింది. వారిని బుజ్జగించి మంగళవారం ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement