ప్రపంచంతో పోటీ పడేలా ‘ఇంటిగ్రేటెడ్ స్కూల్’
మక్తల్: విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా సిద్ధం చేసేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో వసతులు కల్పిస్తామని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మండలంలోని గొల్లపల్లిలో 25 ఎకరాల్లో రూ. 250 కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.వందల కోట్లు ఖర్చుపెడుతుందన్నారు. గతంలో ఎవరూ చేయని అభివృద్ధి నేడు నియోజకవర్గంలో కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


