ముగిసిన నామినేషన్ల పర్వం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన నామినేషన్ల పర్వం

Jan 31 2026 8:24 AM | Updated on Jan 31 2026 8:24 AM

ముగిస

ముగిసిన నామినేషన్ల పర్వం

నారాయణపేట: మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా బుధవారం ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం సాయంత్రం ముగిసింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 72 వార్డులు ఉండగా.. మూడు రోజుల్లో వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు 541 నామినేషన్లు దాఖలు చేశారు. చివరిరోజున అభ్యర్థులు భారీగా రావడంతో ఉదయం 10.30 నుంచి రాత్రి 7 వరకు నామినేషన్ల పర్వం కొనసాగింది. మొత్తంగా 398 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వివరించారు.

● నారాయణపేట పుర పరిధిలో 24 వార్డులు ఉండగా.. వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు 121 మంది 202 నామినేషన్లు వేశారు. ఇందులో కాంగ్రెస్‌ 72, బీజేపీ 41, బీఆర్‌ఎస్‌ 48, ఎంఐఎం 6, టీడీపీ 2, ఇతరులు 29 మంది ఉన్నారు.

● మక్తల్‌లో 16 వార్డులుండగా.. కాంగ్రెస్‌ 42, బీజేపీ 32, బీఆర్‌ఎస్‌ 23, బీఎస్పీ 9, ఎంఐఎం 3, స్వతంత్రులు 19 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

● కోస్గిలో 16 వార్డులకుగాను కాంగ్రెస్‌ 47, బీఆర్‌ఎస్‌ 37, బీజేపీ 22, ఇతరులు 12 నామినేషన్లు వేశారు.

● మద్దూర్‌ మున్సిపాలిటీలో 16 వార్డులకుగాను 89 నామినేషన్లు దాఖలయ్యాయి.

జిల్లాలో నాలుగు పురపాలికలు..72 వార్డులు

చివరి రోజు 398 దాఖలు

మూడు రోజుల్లో మొత్తం 541 నామపత్రాల స్వీకరణ

ముగిసిన నామినేషన్ల పర్వం 1
1/1

ముగిసిన నామినేషన్ల పర్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement