పార్లమెంట్ మార్చ్‌కు తరలిరావాలి
నారాయణపేట రూరల్: సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఈ నెల 5న నిర్వహించ తలపెట్టిన పార్లమెంట్ మార్చ్ కు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు యాద్గీర్ జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయ ఆవరణలో పార్లమెంట్ మార్చ్‌కు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. డీఎస్సీ ద్వారా ఎంపికై న ఉపాధ్యాయులకు మళ్లీ టెట్ పేరుతో పరీక్ష నిర్వహించడం సరికాదన్నారు. సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ నర్సింహా రెడ్డి, ఉదయభాను, ఏఎంఓ విద్యాసాగర్, ఏఎస్‌ఓ శ్రీనివాస్, రఘువీర్, జనార్దన్, సత్య నారాయణ, రమేశ్, గోవర్ధన్, లక్ష్మణ్, నారాయణరెడ్డి, అరవింద్, వెంకటప్ప పాల్గొన్నారు.
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిపై శిక్షణ
నారాయణపేట: వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి విధానంపై సోమవారం జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యానశాఖల సిబ్బంది, రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఈడీఏ అసిస్టెంట్ మేనేజర్ సుకేష్ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి విధానం, లైసెన్సింగ్, ఐఈసీ సర్టిఫికెట్ పొందడం, ఆర్‌సీఎంసీ నమోదు ప్రక్రియ వంటి అంశాలను విపులంగా వివరించారు. ఎగుమతి మౌలిక సదుపాయాల అభివృద్ధికి సాధారణంగా 40 శాతం, ప్రభుత్వ సంస్థలకు 90 శాతం వరకు రాయితీ ఉంటుందన్నా రు. ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏపీఈడీఏ ద్వారా అందిస్తామని తెలిపారు. అనంతరం డీఏఓ జాన్‌సుధాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తు న్న అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఉద్యాన పంటల ఎగుమతులపై ఉద్యానశాఖ అధికారి సాయిబాబా అవగాహన కల్పించారు.
ప్రతి విద్యార్థికి పోటీతత్వం అవసరం
నారాయణపేట రూరల్: విద్యార్థుల్లో పోటీతత్వం పెంపొందించాల్సిన అవసరముందని డీఈఓ గోవిందరాజులు అన్నారు. జిల్లా కేంద్రంలోని గ్రౌండ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ విజ్ఞాన్, తెలంగాణ సోషల్ స్టడీస్ ఫోరం ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు సాంఘికశాస్త్రం జిల్లాస్థాయి ప్రతిభా పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. సోషల్ ఫోరం ఆధ్వర్యంలో ప్రతిభ పరీక్ష నిర్వహించి, విద్యార్థుల్లో ఉన్న జ్ఞానాన్ని వెలికితీయడం అభినందనీయమన్నారు. పరీక్షలపై విద్యార్థుల్లో ఉన్న భయాన్ని పోగొట్టి.. వారిలో స్ఫూర్తి నింపుతుందన్నారు. విద్యార్థులు సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకొని భవిష్యత్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు ప్రేరణ తరగతులు నిర్వహించి.. భవిష్యత్ మార్గదర్శనం చేశారు. కాగా, జిల్లాస్థాయి టాలెంట్ టెస్టులో ప్రతిభకనబర్చిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. తెలుగు మీడియంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో కళ్యాణి, పూజ, కృష్ణయ్య నిలవగా.. ఆంగ్ల మాధ్యమంలో పూర్విక, కార్తీక్ , శంభావి నిలిచారు. కార్యక్రమంలో జిల్లా సోషల్ ఫోరం అధ్యక్షుడు రవికుమార్, ప్రధాన కార్యదర్శి కనకప్ప, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సెక్రెటరీ యశ్వంత్, ఎంఈఓలు కృష్ణారెడ్డి, గాయత్రి, సెక్టోరియల్ అధికారులు విద్యాసాగర్ , నాగార్జునరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పరీక్షలను పరిశీలించిన పీయూ రిజిస్ట్రార్
మహబూబ్‌నగర్ న్యూటౌన్: పాలమూరు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలనుయూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ. రమేశ్‌బాబు సోమవారం పరిశీలించారు. అలాగే పీజీ రెండో సంవత్సరం మూడో సెమిస్టర్ పరీక్షలను పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ డా.మధుసూదన్‌రెడ్డి తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా.చంద్రకిరణ్, హెచ్‌ఓడీ డా.పండుగ రామరాజు, అధ్యాపకులు పాల్గొన్నారు.
పార్లమెంట్ మార్చ్‌కు తరలిరావాలి


