వికసిత భారత్‌ బడ్జెట్‌.. | - | Sakshi
Sakshi News home page

వికసిత భారత్‌ బడ్జెట్‌..

Feb 2 2026 8:17 AM | Updated on Feb 2 2026 8:17 AM

వికసి

వికసిత భారత్‌ బడ్జెట్‌..

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్‌న దేశ ఆర్థికవృద్ధిని వేగవంతం చేయడం, సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌ లక్ష్యానికి అనుగుణంగా బడ్జెట్‌ రూపొందించి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. బయో ఫార్మా మాన్యుఫ్యాక్చరింగ్‌, విద్య, వైద్య, వ్యవసాయరంగాలకు పెద్దపీట వేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కీలక రంగాలకు భారీ కేటాయింపులు, విదేశీ పెట్టుబడులకు అవకాశాలు, ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌పై పన్నుల పెంపువంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం హర్షణీయం.

– సత్యయాదవ్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు

సామాన్యులకు నష్టమే..

కేంద్రం ప్రకటించిన బడ్జెట్‌తో సామాన్యులకు నష్టమే. ఈసారి ఇన్‌కం ట్యాక్స్‌ స్లాబ్‌లో ఏ మాత్రం మార్పులు కనిపించడం లేదు. బంగారం, నిత్యవసర సరుకుల ధరల నియంత్రణకు సరిపోను బడ్జెట్‌ ఇది. రూపాయి విలువ పడిపోతున్నా.. పట్టింపు లేదు.

– ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, నారాయణపేట

అంకెల గారడీ..

కేంద్ర బడ్జెట్‌ ప్రకటించిన రోజే స్టాక్‌మార్కెట్‌ కుప్పకులింది. బంగారం, వెండి ధరలు పతనం అవుతున్నాయి. సామాన్యులు, నిరుద్యోగులను నిరాశ పర్చింది. ఈ బడ్జెట్‌లో అంకెలు మార్చారే తప్పా యువత, రైతులు, మధ్యతరగతి ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు.

– ఎస్‌.రాజేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే

వికసిత భారత్‌ బడ్జెట్‌.. 
1
1/2

వికసిత భారత్‌ బడ్జెట్‌..

వికసిత భారత్‌ బడ్జెట్‌.. 
2
2/2

వికసిత భారత్‌ బడ్జెట్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement