ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి
మాగనూర్: ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని జిల్లా విద్యాధికారి గోవిందరాజు ఆదేశించారు. బుధవారం ఆయన స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలతో పాటు కస్తూర్బా విద్యాలయను తనిఖీ చేశారు. జెడ్పీ ఉన్నత పాఠశాల లో ఉపాధ్యాయుల పనితీరు సంతృప్తికరంగా ఉందని ప్రశంసించారు. రికార్డుల నిర్వహణ నియమావళి ప్రకారం కొనసాగుతుందని అభినందించారు. ఆయన వెంట మండల విద్యాధి కారి మురళీధర్‌రెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు.
జాగ్రత్తలు పాటిద్దాం.. ప్రమాదాలు నివారిద్దాం
కోస్గి రూరల్: జాగ్రత్తలు పాటిస్తూ వాహనాలు నడపడంతో ప్రమాదాలు తగ్గించవచ్చని జిల్లా రవాణాశాఖ అధికారి బోధిశ్రీ జ్యోతి అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం మండలంలోని మీర్జాపూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రహదారి నిబంధనలపై అవగాహన కల్పించారు. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడంతోనే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. 18 ఏళ్లు నిండిన యువత మాత్రమే వాహనాలు నడపాలని, ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలు నడపరాదని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు జనార్దన్‌రెడ్డి, సిద్రాములు, వార్ల మల్లేషం, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ట్రాఫిక్ నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలని పీయూ వీసీ శ్రీనివాస్ సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పీయూలో అధికారులు బుధవారం హ్యాకథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీయూ నుంచి వన్‌టౌన్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వీసీ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియమాలు పాటించకుండా డ్రైవింగ్ చేస్తే జరిగే ప్రమాదాలతో జీవితాంతం బాధపడాల్సి వస్తుందన్నారు. అతివేగం ప్రమాదకరమని, నిర్ణీత వేగంతో రోడ్డుపై సిగ్నల్స్‌ను గమనిస్తూ వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా యువత మద్యం తాగి వాహనాలను నడపొద్దని, దాని వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని, డ్రైవ్ చేసేటప్పుడు సెల్‌ఫోన్‌లు కూడా మాట్లాడొద్దని సూచించారు. అడిషనల్ డిఎస్పీ రత్నం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మద్యం తాగి వాహనాలను నిర్లక్ష్యంగా నడపడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందన్నారు. రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ, డీటీఓ నాగేశ్వర్‌రావు, ఎంవీఐ వాసుదేవరావు, ఏఎంవీఐ రూబీనా పర్వీన్, ప్రవీణ్, రఘుబాబు, పీయూ అధికారులు కృష్ణయ్య, రవికుమార్, గాలెన్న, అర్జున్‌కుమార్, చిన్నాదేవి, ఈశ్వర్‌కుమార్, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి


