దేశం గర్వించదగ్గ మహానేత నేతాజీ
నారాయణపేట: స్వాతంత్య్ర పోరాటంలో కీలక భూమిక పోషించిన మహానేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతీయులందరికీ ఆదర్శప్రాయుడని ఎస్పీ డా. వినీత్ అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లాకేంద్రంలోని సుభాష్ రోడ్‌లో ఉన్న ఆయన విగ్రహానికి ఎస్పీ పూలమాల వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేతాజీ చూపిన మార్గంలో పయనించి ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐ శివశంకర్, పట్టణ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోనంగేరి హన్మంతు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ నాగరాజు, శ్యాంసుందర్‌గౌడ్, బండి శివరాంరెడ్డి, సిద్ధి వెంకట్రాములు, లక్ష్మీకాంత్, మో హన్, ప్రశాంత్‌కుమార్, అనుపూర్ సునీల్‌కుమార్, మన్నె జయప్రకాష్, బండి రాజు, హన్మంతు, గజ్జలి గిరన్న, యువత తదితరులు పాల్గొన్నారు.


