ఎంపీడీఓల సంఘం జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసులు | - | Sakshi
Sakshi News home page

ఎంపీడీఓల సంఘం జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసులు

Jan 26 2026 4:10 AM | Updated on Jan 26 2026 4:10 AM

ఎంపీడ

ఎంపీడీఓల సంఘం జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసులు

నర్వ: ఎంపీడీఓల సంఘం జిల్లా అధ్యక్షుడిగా నర్వ మండల ఎంపీడీఓ శ్రీనివాసులు ఎంపిక కా వడంతో మండల పరిషత్‌ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. విధుల్లో అంకితభావంతో పనిచేస్తూ.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ఎంపీడీఓను జిల్లా ఎంపీడీఓ అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకోవడం సముచితమేనన్నారు. ఆయన ఎన్నికపై ఎంపీఓ రాఘవేందర్‌, ఏపీఓ గౌరిశంకర్‌గౌడ్‌, ఏపీఎం చంద్రశేఖర్‌, ఉపాధి టెక్నికల్‌ అసిస్టెంట్లు గోపాల్‌, రవి, శ్రావణి, పంచాయతీ కార్యదర్శులు రాజబాబు, గిడెన్‌, శ్రీకాంత్‌రెడ్డి, అర్జున్‌ తదితరులు అభినందనలు తెలిపారు.

అందరికీ శ్రేష్ఠమైన ఆహారం అందించాలి

నారాయణపేట ఎడ్యుకేషన్‌: భారత ప్రభుత్వ ఆదేశానుసారం ప్రకృతి వ్యవసాయ విస్తరణలో భాగంగా నేషనల్‌ మిషన్‌ ఆన్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామ భారతి స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఎన్‌ఎంఎన్‌ఎఫ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం గ్రామ భారతి నారాయణపేట అధ్యక్షుడు జయచంద్రమోహన్‌ వ్యవసాయ క్షేత్రంలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వ్యవసాయాధికారి జాన్‌ సుధాకర్‌ మాట్లాడుతూ.. కృషి సఖీలకు నారాయణపేటలో ప్రకృతి వ్యవసాయ విస్తరణ బాధ్యతలు, ప్రతి నెల వారికి గౌరవ వేతనంతో పాటు ఎలాంటి ప్రయోజనాలు చేకురాతాయో తెలియజేశారు. అదేవిధంగా ముఖ్య అతిథులుగా గ్రామ భారతి గౌరవ అధ్యక్షుడు, నాబార్డ్‌ పూర్వ సీజీఎమ్‌ మోటూరి సూర్యకళ మాట్లాడుతూ ప్రతి నెల జయచంద్ర వ్యవసాయ క్షేత్రంలో కొనసాగుతుందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న కృషి సఖీలకు ధృవీకరణ పత్రాలు, ప్రకృతి వ్యవసాయ పుస్తకాలను అందించారు. కార్యక్రమంలో రఘోత్తమ ఆచార్యలు, భారతీయ కిసాన్‌ సంఘ్‌ రాష్ట్ర కన్వీనర్‌ వెంకోబా, గ్రామ భారతి నారాయణపేట ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, దేవేందర్‌ రాజు, ముకుందరెడ్డి, జ్ఞానేశ్వర్‌, శిక్షకుడు రాజేష్‌, పాలమూరు గ్రామ భారతి అధ్యక్షుడు రాజనరసింహ, నారాయణపేట రైతులు పాల్గొన్నారు.ఽ

ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ఆరా

దామరగిద్ద: కేంద్ర ఐఈఎస్‌కు చెందిన ఆర్మీ ఇంజినీరింగ్‌ సర్వీస్‌ ట్రెయినీ బృందం ఆదివారం మండల కేంద్రంలో పర్యటించారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి సమక్షంలో గ్రామంలో సీఎస్పీ కేంద్రం, గ్రామ పంచాయతీ భవనం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పరిశీలించడంతో వ్యవసాయ కూలీలతో మాట్లాడి పలు వివరాలను సేకరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్వయం సమృద్ధి పథకాలను అమలు తీరును అడిగి తెలుసు కున్నారు. రైతుభరోసా, సీఎస్పీ, సోషియో ఎకనామిక్‌ లబ్ధిదారులతో మాటాడారు. కేంద్ర బృందం సభ్యుల్లో సూరజ్‌కుమార్‌, రోహిత్‌కుమార్‌, అమన్‌ ప్రతాప్‌సింగ్‌, రాజేశ్‌, మృంత్యుజయ్‌ పాత్ర ఉన్నారు. మరో రెండు రోజుల పాటు గ్రామంలో మహిళ సమాఖ్య, సీతాఫల్‌ ప్రాసెసింగ్‌ నిర్వహణ, తదితర కేంద్ర పథకాల అమలు తీరును పరిశీలించనున్నట్లు వారు తెలిపారు.

25ఎన్‌ఆర్‌పిటి402–210083: సీఎస్పీ కేంద్రంలో వివరాలు తెలుసుకుంటున్న కేంద్ర బృందం సభ్యులు

ఎంపీడీఓల సంఘం జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసులు 
1
1/1

ఎంపీడీఓల సంఘం జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement