వేరుశనగ క్వింటా రూ.10,555
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం వేరుశనగ క్వింటాకు గరిష్టంగా రూ. 10,555, కనిష్టంగా రూ. 4,600 ధర పలికింది. అదే విధంగా ఎర్ర కందులు గరిష్టంగా రూ. 8,639, కనిష్టంగా రూ. 7,151, తెల్లకందులు గరిష్టంగా రూ. 8,589, కనిష్టంగా రూ. 7,080 ధరలు పలికాయి.
ఉత్సాహంగా
అండర్–16 జట్టు ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ మైదానంలో మంగళవారం ఉమ్మడి జిల్లా అండర్–16 క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ నుంచి సంగారెడ్డిలో హెచ్‌సీఏ అండర్–16 ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్ ఉంటుందని తెలిపారు. ఈ టోర్నీలో ఉమ్మడి జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కోచ్‌లు గోపాలకృష్ణ, ముఖ్తార్‌అలీ, క్రీడాకారుడు మహేష్ పాల్గొన్నారు.
ముగిసిన పాలెం శ్రీవారి బ్రహ్మోత్సవాలు
బిజినేపల్లి: మండలంలోని పాలెం శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. వారం రోజులపాటు కొనసాగిన ఉత్సవాల్లో ఆలయ అర్చక బృందం స్వామివారికి నిత్యారాధన, హోమం, పూర్ణాహుతి, బలిహరణం, చక్రస్నానం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం ధ్వజ అవరోహణం, పుష్పయాగం, పురవీధుల్లో శేషవాహనసేవ నిర్వహించారు.


