ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో..
ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఒక కార్పొరేషన్, 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. మహబూబ్‌నగర్‌లోని జడ్చర్ల, నాగర్‌కర్నూల్‌లోని అచ్చంపేట పురపాలికల పాలక వర్గాల పదవీ కాలం మే నెలలో ముగియనుంది. ఇవి పోనూ మిగిలిన 19 (ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీలు) వాటిలో ఎన్నికలు జరగనున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో గ్రేడ్–1 మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌గా ఆవిర్భవించింది. ఇదే జిల్లాలో మేజర్ పంచాయతీగా ఉన్న దేవరకద్ర, నారాయణపేట జిల్లాలో మద్దూరు మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందాయి. ఈ మూడు పురపాలికల్లోనూ తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి.


