అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
నారాయణపేట: దేశం మనదే.. తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే.., దిల్ యే ఇండియా.. మా తుజే సలాం.., దేశ్ రంగీలా రంగీలా.., మేమే ఇండియన్స్.. మేమే ఇండియన్స్.., ఇదే మన భారతం.. ఇలలో పూలరథం.. అనే దేశభక్తి గీతాలకు విద్యార్థులు చేసిన నృత్యాలు వీక్షకులను ఎంతగానో అలరించాయి. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమ నత్యాలతో అందరినీ మంత్రముగ్దులను చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ డా.వినీత్ అభినందించారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు


