వేరుశనగ క్వింటా రూ.9,500
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో శనివారం వేరుశనగ క్వింటాకు గరిష్టంగా రూ. 9,500, కనిష్టంగా రూ. 5,050 ధర పలికింది. అలసందలు గరిష్టంగా రూ. 6,195, కనిష్టంగా రూ. 4,809, వడ్లు (సోన) గరిష్టంగా రూ. 2,669, కనిష్టంగా రూ. 2,040, ఎర్రకందులు గరిష్టంగా రూ. 8,209, కనిష్టంగా రూ. 6,452, తెల్లకందులు గరిష్టంగా రూ. 8,361, కనిష్టంగా రూ. 6,336 ధరలు వచ్చాయి.
మున్సిపాలిటీలకు ఇన్‌చార్జిల నియామకం
సాక్షి, నాగర్‌కర్నూల్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీలకు బీఆర్‌ఎస్ ఇన్‌చార్జిలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం నియమించారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, భూత్పూర్ మున్సిపాలిటీకి ఏఎంసీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, దేవరకద్రకు మాజీ చైర్మన్ పల్లె రవి, కొత్తకోటకు పార్టీ సీనియర్ నేత పటేల్ విష్ణువర్ధన్‌రెడ్డిలను నియమించారు. అలాగే జోగుళాంబ జిల్లా పరిధిలోని గద్వాల మున్సిపాలిటీ ఇన్‌చార్జిగా శాట్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, అలంపూర్, అయిజ, వడ్డేపల్లి మున్సిపాలిటీల ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి నియామకం అయ్యారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జిగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కల్వకుర్తి మున్సిపాలిటీకి రాజీవ్‌సాగర్, కొల్లాపూర్ మున్సిపాలిటీకి ఉప్పల వెంకటేష్‌గుప్తాలను నియమించారు.


