విద్యార్థులకు ప్రేరణ తరగతులు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు ప్రేరణ తరగతులు

Mar 11 2026 8:55 AM | Updated on Mar 11 2026 8:55 AM

నారాయణపేట రూరల్‌/నర్వ: రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, గురుకులాలు, కేజీబీవీల విద్యార్థులకు మోటివేషనల్‌, గైడెన్స్‌ సెషన్‌ నిర్వహించారు. మొత్తం 135 పాఠశాలల్లో 6వేల మంది విద్యార్థులు ప్రేరణాత్మక తరగతులను సద్వినియోగం చేసుకున్నట్లు డీఈఓ గోవిందరాజులు తెలిపారు. ఆయా పాఠశాలల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన టీవీల ద్వారా విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ సూచనలను విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రణాళికా బద్ధంగా ఎలా చదువుకోవాలి.. భయం వీడి పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలి.. సమయపాలన తదితర అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు డీఈఓ తెలిపారు.

● కాగా, టీ–సాట్‌ లైవ్‌ ప్రోగ్రామ్‌లో మరికల్‌ మండలం పెద్దకడ్మూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం భాగ్యలక్ష్మి పాల్గొని మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా జిల్లాలో విద్యార్థులకు అమలుచేస్తున్న అకాడమిక్‌ కార్యక్రమాలు, అదనపు తరగతులు, రివిజన్‌ టెస్టులు, సన్నాహాక కార్యక్రమాలపై ప్రత్యక్షంగా తెలియజేశారు. కా ర్యక్రమంలో సెక్టోరియల్‌ అధికారులు విద్యాసాగర్‌, శ్రీనివాస్‌, నాగార్జునరెడ్డి, రాజేంద్ర కుమార్‌, యాదయ్యశెట్టి, భాను ప్రకాశ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement