గడువుల ఎత్తిపోతల..! | - | Sakshi
Sakshi News home page

గడువుల ఎత్తిపోతల..!

Mar 11 2026 8:55 AM | Updated on Mar 11 2026 8:55 AM

సాక్షి, నాగర్‌కర్నూల్‌: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులతో పాటు ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గతంలోనే పాలమూరు–రంగారెడ్డి పనులను పూర్తి చేసేందుకు ఈ ఏడాది మార్చి వరకు గడువు విధించింది. అయితే తాజాగా ప్రభుత్వం మరో 20 నెలల్లో పూర్తి చేసేందుకు లక్ష్యం పెట్టుకుంది. మొత్తానికి 2027 నవంబర్‌ వరకు పాలమూ రు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ని వినియోగంలోకి తెస్తామని ప్రభుత్వం చెబుతుండగా, ఈసారైనా అనుకున్న సమయానికి పూర్తి కావాలంటే అవసరమైన నిధులు కేటాయిస్తేనే పనుల్లో కదలిక వస్తుంది.

కేఎల్‌ఐ, బీమా, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్ట్‌లపై ఫోకస్‌..

2025 మే 1న మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు, సాగునీటి పారుదల శాఖ అధికారుల బృందం పాలమూరు ప్రాజెక్ట్‌ను సందర్శించింది. నార్లాపూర్‌, వట్టెం, ఏదుల రిజర్వాయర్లతో పాటు పంప్‌హౌజ్‌ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 2026 మార్చి కల్లా ప్రాజెక్ట్‌ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. అయితే తాజాగా మరో 20 నెలలకు గడువును పొడిగించింది.

● ఉమ్మడి జిల్లాలో ఏళ్లుగా అసంపూర్తిగానే మిగిలిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(కేఎల్‌ఐ), నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. 2027 మార్చికల్లా పెండింగ్‌ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించింది. అలాగే కొడంగల్‌–నారాయణపేట–మక్తల్‌ ప్రాజెక్ట్‌ పనుల్లో వేగం పెంచి 2027 మార్చి నాటికే పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.

నెట్టెంపాడు

రూ. 252 కోట్లు

రానున్న రెండేళ్లలో ఖర్చు చేసే నిధులు: రూ.22 వేల కోట్లు

ఇంకా కావాల్సిన నిధులు:

రూ.50 వేల కోట్లు

‘పాలమూరు–రంగారెడ్డి’ పనులు పూర్తి చేసేందుకు మరోసారి గడువు పెంపు

20 నెలల్లో పూర్తి చేసేలా

లక్ష్యం నిర్దేశించిన ప్రభుత్వం

వచ్చేమార్చిలోగా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ పెండింగ్‌ పనులు పూర్తి

అనుకున్న సమయానికి పనులు కావాలంటే నిధులు తప్పనిసరి..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపైనే ఉమ్మడి జిల్లావాసుల ఆశలు

నిధులు వస్తేనే పనులు..

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పూర్తి చేయడంలో నిధుల కేటాయింపు విషయమే కీలకంగా మారింది. 2014లో మొత్తం రూ.35,200 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్ట్‌ను ప్రారంభించగా ఏటా ప్రాజెక్ట్‌ వ్యయం గణనీయంగా పెరుగుతోంది. డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లతో కలిపి ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలంటే ఇంకా రూ.50 వేల కోట్లు అవసరం. అయితే ప్రభుత్వం రెండేళ్ల కాలంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు ఇంకా రూ. 22 వేల కోట్లు కేటాయించేందుకు ప్రణాళిక రూపొందించింది. అయితే మిగతా నిధులు విడుదల చేస్తేనే ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయిలో వినియోగంలోకి రానుంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కోసం రూ.909 కోట్లు, కోయిల్‌సాగర్‌ రూ.185 కోట్లు, భీమా ఎత్తిపోతలకు రూ.220 కోట్లు, నెట్టెంపాడు కోసం రూ.252 కోట్లను వచ్చే ఏడాది కాలంలో ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ మేరకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తేనే ప్రాజెక్టుల పనుల్లో పురోగతి ఉండనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement