అర్జీలు సత్వరం పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలు సత్వరం పరిష్కరించాలి

Mar 11 2026 8:55 AM | Updated on Mar 11 2026 8:55 AM

నారాయణపేట: ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు ప్రాధాన్యతనిస్తూ.. ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఫణీందర్‌రెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 14 అర్జీలు అందాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌కు నేరుగా వివరించి.. అర్జీలు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి.. పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) శ్రీను, ఆర్డీఓ రామచందర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement