పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యత
మక్తల్: క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేసిన వారికే తగిన ప్రాధాన్యత ఉంటుందని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డితో కలిసి పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగవేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, బీకేఆర్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ గణేశ్‌కుమార్, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రవికుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


