మహాత్ముడి ఆశయ సాధనకు కృషి | - | Sakshi
Sakshi News home page

మహాత్ముడి ఆశయ సాధనకు కృషి

Jan 31 2026 8:24 AM | Updated on Jan 31 2026 8:24 AM

మహాత్ముడి ఆశయ సాధనకు కృషి

మహాత్ముడి ఆశయ సాధనకు కృషి

మక్తల్‌: ప్రతి ఒక్కరూ మహాత్మాగాంధీ ఆశయాల సాధనకు కృషి చేయాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. శుక్రవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను ఎనాడూ మరవొద్దని సూచించారు. కార్యక్రమంలో బీకేఆర్‌ చైర్మన్‌ బాలకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, వైస్‌ చైర్మన్‌ గణేష్‌కుమార్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ నర్సింహగౌడ్‌, చిన్నహన్మంతు, నాయకులు నారాయణ, నాగరాజు, హరికృష్ణ, వెంకటేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement