యముడి వేషంతో వినూత్న ప్రచారం
జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని పోలీసుశాఖ చేపట్టిన అరైవ్.. అలైవ్ కార్యక్రమంలో భాగంగా శనివారం నారాయణపేట పోలీసులు వినూత్నంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. హోంగార్డు లింగం యముడు వేషధారణ ధరించి.. వాహనదారులకు హెల్మెట్ ధరించడం, డ్రంకెన్ డ్రైవ్ నివారణ, సీట్ బెల్టు వినియోగం, ట్రిపుల్ రైడింగ్, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగం, రాష్ డ్రైవింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కళాత్మకంగా, భావోద్వేగంగా అందించిన సందేశం ప్రజల మనసుల్లో బలమైన ప్రభావం చూపిందని పట్టణ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. – నారాయణపేట


