లక్ష తమలపాకులతో సహస్ర నామార్చన | - | Sakshi
Sakshi News home page

లక్ష తమలపాకులతో సహస్ర నామార్చన

May 13 2026 4:56 AM | Updated on May 13 2026 4:56 AM

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో హనుమాన్‌ జయంతి వేడుకలను అర్చకులు మంగళవారం విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయంలోని ఆంజనేయస్వామికి అర్చకులు అంతరంగింకంగా సంప్రదాయ పూజలు జరిపించారు. అనంతరం కొండపై విష్ణు పుష్కరిణి వద్ద, అనుబంధ పాతగుట్ట ఆలయాల్లో క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి అష్టోత్తర శతమన్యుసూక్త పారాయణాలతో అభిషేకం చేశారు. శ్రీస్వామి వారికి సింధూరంతో విశేషంగా అలంకరించి, లక్ష తమలపాకులతో నాగవళ్లీ (తమలపాకుల)లతో సహస్ర నామార్చన నిర్వహించారు. తరువాత హనుమాన్‌ చాలీసా, సుందరకాండ పారాయణం చేపట్టి, వేద పఠనం చేశారు. శ్రీస్వామి వేడుకల్లో ఈఓ భవానీ శంకర్‌, భక్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement