భువనగిరిటౌన్ : పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం భువనగిరిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడుతోందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథకు సంబంధించిన అంశంపై కూడా అధికారంలో ఉన్నవారు స్పందించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన సదుపాయాలు కల్పించకుండా తేమ శాతం పేరుతో ధాన్యం తూకాల్లో ఆలస్యం చేస్తూ రైతులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. రైతులు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. గాదెగాని మాణిక్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, సహాయ కార్యదర్శులు బొలగాని సత్యనారాయణ, చేడె చంద్రయ్య, రాష్ట్ర సమితి సభ్యులు గోద శ్రీరాములు, కురిమిద్ద శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, ఎండీ ఇమ్రాన్, బండి జంగమ్మ, కొల్లూరి రాజయ్య, బచ్చనగోని గాలయ్య, చెక్క వెంకటేష్, ఉప్పల ముత్యాలు, పల్లె శేఖర్ రెడ్డి, చిగుర్ల లింగం, పేరబోయిన మహేందర్, యేశాల అశోక్, కళ్లెపల్లి మహేందర్, సోమన సబిత, అన్నెపు వెంకట్, మరుపాక వెంకటేష్, అన్నైమెన వెంకటేష్, ఇంజ హేమలత, చాపల అంజయ్య, కలకొండ సంజీవ, దాసరి లక్ష్మయ్య, బబ్బురి శ్రీధర్, మూల పోచయ్య, వడ్లకొండ భారతమ్మ, కాషపాక దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం


