యాదగిరిగుట్ట : ఆటోలో భక్తురాలు మరిచిపోయిన బంగారు ఆభరణాలను తిరిగి ఇచ్చి నిజాయితీ చాటుకున్నాడు ఓ ఆటో డ్రైవర్. వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తురాలు ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చింది. కొండ పైకి ఆటోలో ప్రయాణం చేస్తున్న సమయంలో సుమారు మూడు తులాల బంగారు పుస్తెలతాడు తెగి ఆటోలో పడిపోయింది. అది గమనించకుండా ఆమె ఆటో దిగి వెళ్లిపోయింది. బంగారు పుస్తెలతాడును గమనించిన ఆటో డ్రైవర్ మాటూరి హరిబాబు ఆ భక్తురాలిని గుర్తించి ఈఓ భవాని శంకర్, ఎస్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ శేషగిరిరావు ఆధ్వర్యంలో ఆమెకు పుస్తెలతాడు అప్పగించాడు. ఆటో డ్రైవర్ మాటురి హరిబాబును అధికారులు అభినందించారు.


