సమస్యల పరిష్కారానికే మార్నింగ్‌ వాక్‌ | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికే మార్నింగ్‌ వాక్‌

May 15 2026 10:56 AM | Updated on May 15 2026 10:56 AM

యాదగిరిగుట్ట : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకే మార్నింగ్‌ వాక్‌ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 9, 10, 12 వార్డుల్లో బుధవారం మార్నింగ్‌ వాక్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆయా కాలనీల్లో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, పారిశుధ్ద్యం, తాగునీటి వసతి వంటి సమస్యలపై అక్కడికక్కడే అధికారులతో చర్చించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుండ్లపల్లి వాణి భరత్‌గౌడ్‌, కౌన్సిలర్లు బూడిద సురేందర్‌, ముక్కెర్ల మల్లేష్‌, సాధునేని ధనలక్ష్మి, బబ్బూరి శ్రీధర్‌, మున్సిపల్‌, ఇతర శాఖల అధికారులు ఉన్నారు.

ఫ ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య

Advertisement
 
Advertisement
Advertisement