భువనగిరి : రైతులు పండించిన పంటల మద్దతు ధరలను పెంచుతూ కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పెంచిన మద్దతు ధరలు వానాకాలం సీజన్ నుంచి వర్తించనున్నాయి. వరి, పత్తి, జొన్న, సజ్జ, రాగులు, కందులు, మొక్కజొన్న, మినుములు, పెసలు, పొద్దుతిరుగుడు, వెరుశెనగ, నువ్వులు, సోయాబిన్ ఽవంటి పంటల ధరలను ప్రభుత్వం పెంచింది.
ఆదాయం పెంపే లక్ష్యం
రైతులు ఆధాయాన్ని పెంచే లక్ష్యంతో వానకాలం పంటల కనీస మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. పంట పెట్టుబడి ఖర్చుకు అదనంగా 50 శాతం ఉండేలా కొత్త ధరలను నిర్ణయించారు. కానీ కొన్ని పంటల విషయంలో మద్దత ధరలు స్వల్పంగా ఉండటం రైతులకు కొంత నిరాశ కలిగించే విషయంగా ఉన్నట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు.
వరి, పెసలకు నామమాత్రమే
రాష్ట్రంలో వరి సాగు అధికంగా ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంటల మద్దతు ధరలో వరి పంటకు నామ మాత్రంగానే పెంచింది. దాంతో పాటు పెసలకు క్వింటాకు కేవలం రూ.12లను మాత్రమే పెంచింది. ఇటీవల కాలంలో వరికి తెగుళ్లు అధికంగా సోకుతుండడం, కూలీల రేట్లు, ఎరువుల ధరలు పెరగడంతో పెట్టుబడి ఖర్చులకు భారీగా పెరిగాయి. కానీ మద్దతు ధర మాత్రం తక్కువగానే ఉండడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. వరి పంటకు మద్దతు ధర రూ.72లు పెంచితే, పత్తికి మాత్రం రూ.557 పెంచడం రైతులకు కొంత ఊరటను కలిగించే అంశం.
ఫ మద్దతు ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం
ఫ స్వల్పంగా పెరిగిన వరి, పెసల ధరలు
ఫ వచ్చే సీజన్ నుంచి వర్తింపు


