నిడమనూరు : ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు అదుపుతప్పి కిందపడి మృతిచెందాడు. ఈ ఘటన నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామ శివారులో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండల కేంద్రానికి చెందిన కన్నెబోయిన గోవిందు అలియాస్ గణేష్ (29)ముకుందాపురంలోని ఫంక్షన్‌హాల్‌లో వివాహానికి హాజరై ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వస్తుండగా.. గ్రామశివారులోని మూలమలుపు వద్ద అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గోవిందు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నిడమనూరు ఎస్‌ఐ ఉప్పు సురేష్ తెలిపారు. కాగా బుధవారం గోవిందు మొదటి వివాహ వార్షికోత్సవం అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.


