కందాల లక్ష్మికి కన్నీటి వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

కందాల లక్ష్మికి కన్నీటి వీడ్కోలు

May 11 2026 9:55 AM | Updated on May 11 2026 9:55 AM

నకిరేకల్‌ : నకిరేకల్‌లోని ఏవీఎం విద్యాసంస్థల అధినేత, ట్రస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి సతీమణి లక్ష్మి అనారోగ్యంతో శనివారం రాత్రి మృతిచెందగా.. ఆదివారం అంత్యక్రియలు ముగిశాయి. నకిరేకల్‌ పట్టణంలోని మార్కెట్‌ రోడ్డులో గల పాపిరెడ్డి నివాసం నుంచి లక్ష్మి భౌతికకాయానికి అంతిమయాత్ర నిర్వహించారు. అనంతరం వారి స్వగ్రామమైన శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో దహన సంస్కారాలు నిర్వహించారు. లక్ష్మి భౌతికకాయానికి ప్రభుత్వ విప్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్నరాజ్‌, కాంగ్రెస్‌ మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య, నకిరేకల్‌ మున్సిపల్‌ మాజీ చైర్మన్లు రాచకొండ శ్రీనివాస్‌గౌడ్‌, చౌగోని రజితాశ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు నివాళులర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement