కొత్తగూడెం వద్ద ట్రాఫిక్‌ జామ్‌ | - | Sakshi
Sakshi News home page

కొత్తగూడెం వద్ద ట్రాఫిక్‌ జామ్‌

May 7 2026 9:50 AM | Updated on May 7 2026 9:50 AM

భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌పోచంపల్లి మండల శివారులోని కొత్తగూడెం సమీపంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి మామిడికాయల లోడ్‌లతో లారీలు, ట్రక్కులు, ఆటోలు, మినీవాహనాలు కొత్తగూడెం వద్ద ఉన్న పండ్ల మార్కెట్‌కు వస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్డు వెంట అస్తవ్యస్తంగా పార్కింగ్‌ చేస్తుండటంతో పోచంపల్లికి నుంచి వచ్చే పోయే వాహనాలు, బస్సులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి గంటల తరబడి నిలిచిపోవడంతో హైదరాబాద్‌కు వెళ్తున్న ఉద్యోగస్తులు, విద్యార్థులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌ సమస్యను బుధవారం మున్సిపల్‌ చైర్మన్‌ తడక వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ యువజన నాయకుడు గుత్తి బాలశంకర్‌.. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఎంపీ వెంటనే స్పందిస్తూ వనస్థలిపురం ట్రాఫిక్‌ ఏసీపీ నవీన్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. మైదానంలో వాహనాలను పార్కింగ్‌ చేయించి టోకెన్లు ఇచ్చి వాహనాలను ఒక్కొక్కటిగా పంపించాలని సూచించారు. ఎంపీ ఆదేశాల మేరకు ఏసీపీ వెంటనే ఘటన స్థలాన్ని సందర్శించారు. ట్రాఫిక్‌ సమస్యను గురువారంలోగా పరిష్కరిస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement