రేవంత్‌ ప్రభుత్వానికి పాలనపై సోయిలేదు | - | Sakshi
Sakshi News home page

రేవంత్‌ ప్రభుత్వానికి పాలనపై సోయిలేదు

May 17 2026 7:26 AM | Updated on May 17 2026 7:26 AM

ఆలేరు రూరల్‌ : రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి పాలనపై సోయిలేకుండా..ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి నియతృత్వంగా వ్యవహరిస్తోందని తెలంగాణ రాష్ట్రీయ్‌ లోక్‌ దళ్‌(ఆర్‌ఎల్‌డీ) పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్‌ కుమార్‌ అన్నారు. శనివారం ఆలేరులోని రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన కమిటీకి కె.కేశవరావును చైర్మన్‌గా నియమించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. జూన్‌ 27న వరంగల్‌లోని కేఐటీఎస్‌ కళాశాలలో రాష్ట్రీయ లోక్‌ దళ్‌(ఆర్‌ఎల్‌డీ) ఆధ్వర్యంలో రోజ్‌గార్‌, స్కిల్‌ అండ్‌ లోన్‌ మేళాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేరోజు లక్ష సైన్యం పేరుతో లక్షమందికి నియామకాల కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ నర్సంహారావు, ఆర్‌ఎల్‌డీ జిల్లా అధ్యక్షుడు జి.బీరప్ప, యూత్‌ జిల్లా అఽధ్యక్షుడు రాజ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

ఫ ఆర్‌ఎల్‌డీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్‌ కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement