ఏసీబీకి పట్టుబడిన అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీకి పట్టుబడిన అసిస్టెంట్‌ లైన్‌మెన్‌

May 17 2026 7:32 AM | Updated on May 17 2026 7:32 AM

మోటకొండూర్‌ : విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌, స్తంభాలు ఏర్పాటు చేసేందుకు రైతు నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్‌ శాఖ అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ శనివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. నల్లగొండ రేంజ్‌ ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మోటకొండూర్‌ మండల కేంద్రానికి చెందిన ఓ రైతు తన వ్యవసాయ బావికి 7 విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయాలని స్థానిక విద్యుత్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే పని జరగాలంటే రూ.35 వేలు లంచం ఇవ్వాలని మోటకొండూర్‌ మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ పప్పుల రమేష్‌ డిమాండ్‌ చేశాడు. దీంతో సదరు రైతు నల్లగొండ రేంజ్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శనివారం సాయంత్రం సదరు రైతు ఇంటి అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం స్థానిక విద్యుత్‌ కార్యాలయానికి వెళ్లి రికార్డులు పరిశీలించారు. ఆదివారం రమేష్‌ను హైదరాబాద్‌లోని నాపంల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ అధికారైనా లంచం డిమాండ్‌ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు లేదా వాట్సాప్‌ నంబర్‌ 94404 46106కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు సూచించారు.

ఫ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌, స్తంభాల

ఏర్పాటుకు రూ.35 వేలు లంచం డిమాండ్‌

ఫ రైతు ఫిర్యాదుతో డబ్బు తీసుకుంటుండగా

పట్టుకున్న ఏసీబీ అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement