భువనగిరి: ఈ నెల 8,9,10 తేదీల్లో భువనగిరిలో నిర్వహించే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కోరారు. గురువారం సాయంత్రం స్థానిక న్యూడైమెన్షన్ హైస్కూల్‌లో చేసిన ఏర్పాట్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. సుమారు 20 కంపెనీలకుపైగా పాల్గొని 3500 ఖాళీలను భర్తీ చేసుకునేందుకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట కుంభం ఫౌండేషన్ చైర్మన్ కీర్తిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ శ్రీవాణి, వైస్ చైర్‌పర్సన్ మంజుల, నాయకులు పోత్నక్ ప్రమోద్‌కుమార్, కూర వెంకటేశం, మంగ ప్రవీణ్, సాయి, సన్నీ ఉన్నారు.


