సాగులో యూరియా వినియోగాన్ని తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

సాగులో యూరియా వినియోగాన్ని తగ్గించాలి

May 15 2026 11:02 AM | Updated on May 15 2026 11:02 AM

చౌటుప్పల్‌ : రైతులు పంటల సాగులో యూరియా వినియోగాన్ని తగ్గించాలని, దానికి ప్రత్యామ్నాయంగా నానో యూరియా వాడాలని ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ప్రభావతి సూచించారు. చౌటుప్పల్‌లోని రైతువేదికలో బుధవారం రైతు ముంగింట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరికి ఎకరానికి రెండు బస్తాలకు మించి యూరియా వాడొద్దన్నారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ ఉబ్బు వెంకటయ్య, సింగిల్‌విండో చైర్మన్‌ చింతల దామోదర్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ చెన్నగోని అంజయ్య, ఏఓ ముత్యాల నాగరాజు, కౌన్సిలర్లు రాకేష్‌రెడ్డి, లక్ష్మీముత్తయ్య, గుండ్లబావి సర్పంచ్‌ నందగిరి వెంకటేష్‌, సింగిల్‌విండో మాజీ చైర్మన్‌ చీరిక సంజీవరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement