మఠంపల్లి : జిల్లాలో ప్రసిద్ధి గాంచిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మిచెంచులక్ష్మిసమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్య కల్యాణాన్ని ఆదివారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభి షేకం చేపట్టారు. శ్రీస్వామి అమ్మవార్లలను నూతన పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేశారు. అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మదుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో నిత్య కల్యాణాన్ని వేద మంత్రోచ్ఛరణలతో వైభవంగా నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు, ఈఓ బి.జ్యోతి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.


