భువనగిరిటౌన్ : పకడ్బందీగా ఇళ్ల గణన ప్రక్రియ చేపట్టనున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పేర్కొన్నారు. సోమవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న హౌస్ లిస్టింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించి మాట్లాడుతూ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్‌లో ప్రతి ఇంటిని తప్పనిసరిగా కవర్ చేయాలన్నారు. ఏ ఒక్క కుటుంబం లేదా గృహ గణనలో వదలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలన్నారు.


