ప్రజలు ఇచ్చే వ్యక్తిగత వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. జిల్లా అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో ఈ గణాంకాలు కీలకమని, అందుకే ప్రజలందరూ ఎన్యూమరేటర్లకు సహకరించి కచ్చితమైన సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు.
భువనగిరిటౌన్ : జిల్లాలో 16వ జనగణన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సారి జనగణనను పూర్తిస్థాయిలో డిజిటల్ పద్ధతిలో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నెల రోజుల పాటు కొనసాగే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ఇళ్ల గుర్తింపు ప్రక్రియను ఎన్యూమరేటర్లు చేపట్టారు. 14 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించనున్నారు. వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా అక్కడికక్కడే నమోదు చేయనున్నారు.
ఇవి సిద్ధంగా ఉంచుకోవాలి
జనగణన అధికారులు ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు వారికి పూర్తి వివరాలు అందించడంతో పాటు ప్రక్రియ వేగంగా పూర్తి కావడానికి తగిన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, మొబైల్ నంబర్, వయస్సు, చిరునామా దృవీకరణ కోసం ఓటర్ ఐడీ లేదా రేషన్ కార్డు. నివాస గృహం వివరాలు (సొంతమా? అద్దెదా?), ఇంట్లోని మౌలిక సదుపాయాలు (విద్యుత్, గ్యాస్, మరుగుదొడ్డి, ఇంటర్నెట్ మొదలైనవి), కుటుంబ సభ్యుల విద్యార్హతలు, వృత్తి లేదా వ్యాపారం వివరాలు.
6381 మంది స్వీయగణన
జనగణన కోసం ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్లు ప్రజలు చెప్పే వివరాల కోసం వేచి చూడకుండా, ప్రభుత్వ పోర్టల్ ద్వారా తమ వివరాలను తామే నమోదు చేసుకునే సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు కేంద్ర ప్రభుత్వం ఈనెల 10వ తేదీ వరకు అవకాశం కల్పించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 6381 మంది స్వీయగణన చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వారు తమకు లభించిన ఎస్‌ఈ ఐడీని ఎన్యూమరేటర్లకు చూపిస్తే సరిపోతుంది.
ఫ నేటి నుంచి గృహ గణన
ఫ ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించనున్న ఎన్యూమరేటర్లు


