భువనగిరిటౌన్ : ప్రభుత్వం నిర్ణయించిన తక్కువ ధరలకు క్షేత్రస్థాయిలో పునఃపరిశీలన సర్వే పనులు చేయడం తమవల్ల కాదని లైసెన్స్‌డ్ సర్వేయర్లు శనివారం కలెక్టరేట్‌లో వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం ఎకరానికి నిర్ణయించిన రూ.50 ధర అత్యంత తక్కువగా ఉందని, ఈ ధరకు పనులు చేయడం వల్ల తీవ్రంగా నష్టపోతామని సంబంధిత అధికారి దృష్టికి తీసుకెళ్లారు. క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించి, సర్వేయర్ల సంక్షేమాన్ని కాపాడేలా సర్వే ధరలను పునఃసమీక్షించాలని వారు కోరారు. అధికారికి వినతిపత్రం సమర్పించిన వారిలో సర్వేయర్లు జె.డి.ప్రభాకర్ రెడ్డి, బి.నరసింహ, కందన చందు, వాకిటి శ్రీనివాస్‌రెడ్డి, వీరసాగర్, ఎస్.కె.అహ్మద్, కె.నాగరాజు, కె.బిచ్చానాయక్, పి.కుమారస్వామి, చిలువేరు నవీన్, రాజశేఖర్ రెడ్డి, నాజిక్ ఉన్నారు.


