ఆత్మకూరు(ఎం): తాము ధాన్యం తీసుకొచ్చి నలభై రోజులైనా నేటికీ కొనుగోళ్లు చేయడం లేదని ఆగ్రహానికి గురైన రైతులు ఆదివారం ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని వ్యవసాయ సబ్ మార్కెట్‌కు తాళం వేసి నిరసన తెలిపారు. అధికారుల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు బీసు చందర్ గౌడ్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి దాదాపు 130 మంది రైతులు ధాన్యం తీసుకొచ్చారని, ఇప్పటివరకు కేవలం 30 మంది రైతుల ధాన్యం మాత్రమే తూకం వేశారని అన్నారు. మిగతా రైతులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తక్షణమే లారీలను ఏర్పాటు చేయాలని, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బీసు ధనలక్ష్మి, నాయకులు కోరె భిక్షపతి, బండారు సత్యనారాయణ, నాతి రాజు, యాస వెంకట్‌రెడ్డి, పిన్నింటి మోహన్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
ఫ ధాన్యం కొనుగోలు చేయడం
లేదని రైతుల ఆగ్రహం


