ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ ఫలితాలు

May 17 2026 7:26 AM | Updated on May 17 2026 7:26 AM

సాక్షి, యాదాద్రి : ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యుత్తమ ఫలితాలు వస్తున్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శనివారం భువనగిరి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు ఈ ఏడాది 98.30 శాతం ఉత్తీర్ణత సాధించాయన్నారు. విద్యారంగంలో మార్పు కోసమే ఇంటిగ్రేటెడ్‌, పబ్లిక్‌ స్కూళ్లు ఏర్పాటు చేస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ భాస్కర్‌ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటుకు దీటుగా విద్యాబోధన జరుగుతుందన్నారు. టెన్త్‌, ఇంటర్‌, స్కూల్‌ గేమ్స్‌లో ప్రతిభ కనబరిచిన 9 మంది విద్యార్థులకు రూ.10 వేల నగదు పారితోషకం అందించి వారి తల్లిదండ్రులను సన్మానించారు. మండలానికి ముగ్గురు టాపర్లను ఎంపిక చేసిన 51 మంది విద్యార్థులను సన్మానించారు. ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితీ, టీజీఓ జిల్లా అధ్యక్షుడు మందడి ఉపేందర్‌రెడ్డి, గడసంతల మధుసూదన్‌, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ఫ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement