పనికి వెళ్లమని మందలించినందుకు.. | - | Sakshi
Sakshi News home page

పనికి వెళ్లమని మందలించినందుకు..

May 13 2026 2:08 AM | Updated on May 13 2026 2:08 AM

బొమ్మలరామారం : పనికి వెళ్లమని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బొమ్మలరామారం మండలంలో మంగళవారం జరిగింది. ఎస్‌ఐ బుగ్గ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం తాజ్‌పూర్‌ గ్రామానికి చెందిన ఎండీ. నజీర్‌(21) ప్లంబర్‌ పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. కాగా.. కొంతకాలంగా నజీర్‌ పనికి వెళ్లకుండా గ్రామంలో ఖాళీగా తిరుగుతున్నాడు. దీంతో పనికి వెళ్లమని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన నజీర్‌ మంగళవారం బొమ్మలరామారం మండలం పక్కీరుగూడెం శివారులోని ఓ వ్యవసాయ పొలం వద్ద మామిడి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బుగ్గ శ్రీశైలం తెలిపారు. నజీర్‌ తండ్రి గతేడాది వాగులో చేపల వేటకు వెళ్లి మృతిచెందాడు.

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

Advertisement
 
Advertisement
Advertisement