భువనగిరి: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ.. బాలికను వేధించి అత్యాచారానికి పాల్పడినందున సంజయ్‌ని ప్రధాని మోదీ తక్షణమే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.సోమవారం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లేనిపక్షంలో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. మంత్రి నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. లైగింక వేధింపులకు గురైన బాలిక ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే తీసుకోకుండా 8గంటల పాటు నిరీక్షింప చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. పోక్సోచట్టం కింద కేసు నమోదైతే అరెస్టు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం వ్యహరిస్తుంటే ప్రభుత్వం చేస్తోందని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందాలుచేసుకుని రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. బాలిక వద్ద నుంచి సిట్టింగ్ జడ్జి చేత వాంగ్మూలం నమోదు చేయించిన తర్వాతనే విచారణ జరిపించాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ పట్టణ, మండల కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిరణ్‌కుమార్, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, జనగాం పాండు, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు జక్కా రాఘవేందర్‌రెడ్డి, నాయకులు శెట్టి బాలయ్య యాదవ్, ర్యాకల శ్రీనివాస్, జెడ్పీ మాజీ సభ్యుడు బీరు మల్లయ్య, మున్సిపల్‌మాజీ చైర్మన్ పెంట నర్సింహ, కౌన్సిలర్ నగేష్, చెన్న మహేష్, ఎక్బాల్ చౌదరి, జహంగీర్, భిక్షపతి సుభాష్, అజీమొద్దీన్ పాల్గొన్నారు.
ఫ బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి


