సమ్మర్‌ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సమ్మర్‌ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి

May 7 2026 9:50 AM | Updated on May 7 2026 9:50 AM

దేవరకొండ : సమ్మర్‌ క్యాంపులను విద్యార్థులు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. దేవరకొండ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు ఉచిత కరాటే శిక్షణను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కరాటే నేర్చుకోవడం ద్వారా సెల్ఫ్‌ డిఫెన్స్‌తో పాటు శారీరక దృఢత్వం పెంపొందుతుందని పేర్కొన్నారు. క్రీడాకారులకు చేయూత అందిస్తున్న స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్‌వీటీని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉమామహేష్‌, పంతులాల్‌, ఐడీ ప్రసన్న, వైఎస్‌ కరుణాకర్‌, ఆంజనేయులు, వెంకటేష్‌, యాదగిరి, గోపి తదితరులు పాల్గొన్నారు.

దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు

Advertisement
 
Advertisement
Advertisement