ఆవు నిజాయితీ గొప్పది | - | Sakshi
Sakshi News home page

ఆవు నిజాయితీ గొప్పది

May 7 2026 9:50 AM | Updated on May 7 2026 9:50 AM

మేము మోత్కూరులో ఉంటాము. వేసవి సెలవులు కావడంతో ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్‌పేటలో ఉంటున్న మా నానమ్మ ఇంటికి వచ్చాను. మా తాత చెప్పిన పులి, ఆవు కథ నాకు బాగా నచ్చింది.

ఆత్మకూరు(ఎం) : ఓ ఆవు ఒక లేగ దూడను ఇంటి వద్ద వదిలి మిగిలన మందతో కలసి మేతకు పోతుంది. అక్కడ పులి ఎదురవుతుంది. ఎంతో ఆకలితో ఉన్న ఆ పులి ఆవును తినాలని చూస్తుంది. అప్పుడు ఆ ఆవు ఇంటి వద్ద చిన్నలేగ దూడ ఉంది. దానికి కడుపు నిండా పాలు ఇచ్చి వచ్చి నీకు ఆహారమై ఆకలి తీర్చుతానని చెబుతుంది. పులి ఆవు మాటలను నమ్మలేదు. ఆవు బతిమిలాడడంతో చివరకు పులి సమ్మతించి ఆవును వెళ్లమంది. దీంతో ఆవు పరుగు పరుగున ఇంటికి చేరి లేగ దూడను అక్కున చేర్చుకుంది. కడుపు నిండా పాలు ఇచ్చింది. కంట కన్నీరు కార్చుకుంటూ తిరిగి ఆవు అడవికి పయనమైంది. ఇచ్చిన మాట ప్రకారం పులికు ఆహారం అయ్యేందుకు దాని ఎదురుగా నిల్చుంది. కానీ పులి ఆవును తినకుండా.. మాటకు కట్టుబడి నిజాయితీగా తిరిగి వచ్చిన ఆవును మెచ్చుకుంటుంది. ఇంటికి వెళ్లి లేగ దూడతో సంతోషంగా ఉండు అంటూ పులి అక్కడ నుంచి వెళ్లిపోతుంది.

Advertisement
 
Advertisement
Advertisement