ఫ భువనగిరి ఎమ్మెల్యే
కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
వలిగొండ : ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం వలిగొండ మండల కేంద్రంలో రైస్ మిల్లు యజమానులు, రైతులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లు, రవాణా, తూకాలు, చెల్లింపుల్లో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. కొనుగోళ్లలో ఎలాంటి అవక తవకలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్నదాతల సమస్యలు వెంటనే పరిష్కరించేవిధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో వలిగొండ తహసీల్దార్ దశరథ, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమానాయక్, పాశం సత్తిరెడ్డి, గరిషె రవి, సతీష్, చిలుగురి సత్తిరెడ్డి, అశోక్, పాలకూర్ల వెంకన్న, కొండూరు సాయి తదితరులు పాల్గొన్నారు.


