పూడికతీత ముసుగులో మట్టి దందా | - | Sakshi
Sakshi News home page

పూడికతీత ముసుగులో మట్టి దందా

May 8 2026 9:44 AM | Updated on May 8 2026 9:44 AM

లారీల్లో మట్టి నింపుతున్న ఈ ఫొటో మోటకొండూరు మండలం వర్టూరు చెరువుది. అభివృద్ధి కమిటీ పేరుతో తీర్మానం చేసి, దానిని అడ్డంపెట్టుకొని మట్టి దందా కొనసాగిస్తున్నారు. అధికారికంగా 2 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి తరలింపునకు మాత్రమే అనుమతి ఉండగా, దాదాపు 12 ఎకరాల మేర చెరువును తవ్వేస్తున్నారు. మీటరు లోతు తవ్వాల్సి ఉండగా 12 మీటర్ల లోతు తవ్వుతున్నారు. ఆరు టిప్పర్లకు అనుమతి తీసుకొని వందకు పైగా భారీ టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నారు. హైదరాబాద్‌ చుట్టపక్కల, ఘట్కేసర్‌, చౌటుప్పల్‌, తిరుమలగిరి, చీకటి మామిడి, కాటపల్లి తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెరువుల పూడిక పేరుతో తీస్తున్న మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఐలయ్య, అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తదితరులు

సాక్షి, యాదాద్రి : యాదగిరిగుట్ట, ఆలేరు ప్రాంతాల్లో సుమారు 40 వేల పేద, మధ్యతరగతి కుటుంబాల ఇళ్లు, స్థలాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ సమావేశ మందిరంలో మంత్రి పొంగులేటి అధ్యక్షతన ఉమ్మడి నల్లగొండ జిల్లా రెవెన్యూ, గృహనిర్మాణ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. ఐలయ్య, అనిల్‌కుమార్‌రెడ్డిలు తమ నియోజకవర్గాల్లోని దీర్ఘకాలిక సమస్యలను మంత్రి దష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా జిల్లాలోని యాదగిరిగుట్ట, ఆలేరు ప్రాంతాల్లో నిషేధిత జాబితాలో నమోదైన సుమారు 40 వేల పేద, మధ్యతరగతి కుటుంబాల ఇళ్లు, స్థలాలను ఆ జాబితా నుంచి తొలగించాలని కోరారు. దీనిపై మంత్రి పొంగులేటి సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అదేవిధంగా తుర్కపల్లి మండలం మల్కాపూర్‌ గ్రామంలో గతంలో నిర్మించిన ఇళ్లను అటవీ భూములుగా గుర్తించడం వల్ల నిలిచిన కొత్త నిర్మాణాల అనుమతులపై చర్చించగా, వాటిని అటవీ జాబితా నుంచి తొలగించాలని మంత్రి సూచించారు. యాదగిరిగుట్ట రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి కొత్త భవనం మంజూరుకు, తుర్కపల్లి మండలానికి అదనంగా మరో 50 ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు మంత్రి హామీ ఇచ్చారు. పెరిగిన ఆహార భద్రత కార్డుల సంఖ్యకు అనుగుణంగా కొత్త రేషన్‌ దుకాణాల ఏర్పాటుపై సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ధాన్యం సేకరణలో జాప్యం జరగకుండా వాహనాలను అందుబాటులో ఉంచాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా మంత్రులు, పార్లమెంట్‌ సభ్యులు, మండలి సభ్యుడు నెల్లికంటి సత్యం పాల్గొన్నారు.

అడ్డూఅదుపులేని మాఫియా

మీటరులోతుకు అనుమతి.. 12 మీటర్లు తవ్వకం

పొలాల పేరుతో ఇటుక బట్టీలు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు తరలింపు

ఫ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement