యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఈఓ భవానీ శంకర్ పలు విభాగాలకు సంబంధించిన అధికారులను స్థానికంగా బదిలీలు చేశారు. సుమారు 25 మందిని బదిలీ చేశారు. వీరిలో ఏఈఓలు, సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిసెంట్లు, రికార్డు అసిస్టెంట్లు ఉన్నారు. వీరంతా వెంటనే తమకు కేటాయించిన విభాగాల్లో చేరాలని ఈఓ ఆదేశించారు.
యాదగిరిగుట్టలో
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం వేకువ జామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరా ధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు.
8న మత్స్యకారులకు
అవగాహన సదస్సు
భువనగిరిటౌన్ : రైతు వారంలో భాగంగా ఈ నెల 8న మత్స్యకారులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి రాజారాం ఒక ప్రకటనలో తెలిపారు. భూవనగిరి జిల్లా కలెక్టరేట్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందని, మత్స్య శాస్త్రవేత్తలు పాల్గొనే ఈ సదస్సులో చెరువుల్లో కలుపు మొక్కల నివారణ, చేపల వ్యాధుల నియంత్రణ, అధికోత్పత్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారని వివరించారు. జిల్లాలోని మత్స్యకార సంఘాల సభ్యులు, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలి
భువనగిరి: ఈ నెల 10వ తేదీన హైదరాబాద్‌లో జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభను జయప్రదం చేయాలని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కోరారు. భువనగిరి పట్టణంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు రూ. 7 వేల కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ప్రధాని వస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాయ దశరథ, నాయకులు పట్నం శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, రామకృష్ణ, నరసింహారావు, కృష్ణచారి, ఉడుత భాస్కర్, మల్లికార్జున్ పాల్గొన్నారు.


