చెక్కుల పంపిణీలో రసాభాస | - | Sakshi
Sakshi News home page

చెక్కుల పంపిణీలో రసాభాస

May 15 2026 9:50 AM | Updated on May 15 2026 9:50 AM

ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రసాభాస చోటుచేసుకుంది. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతుండగా.. మధ్యలో బీఆర్‌ఎస్‌ నాయకులు జోక్యం చేసుకొని కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే పాడి రైతులు అప్పుల పాలయ్యారని వాదించారు. మాజీ మదర్‌ డైయిరీ చైర్మన్‌ లింగాల శ్రీకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సభలో కాంగ్రెస్‌ నాయకులు తప్ప రైతులు ఉన్నారా అని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే లేచి ఇక్కడికి వచ్చిన వారందరూ రైతులే ఉన్నారు. నాయకులు ఎవ్వరూ కూడా లేరన్నారు. మీరు రైతులను అమానిస్తున్నారని, వెంటనే రైతులకు శ్రీకర్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని వాదించారు. దీంతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య కొద్దిపాటి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని ఎవరి సీటులో వారిని కూర్చోబెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement