జిత్తులమారి నక్క | - | Sakshi
Sakshi News home page

జిత్తులమారి నక్క

May 15 2026 9:50 AM | Updated on May 15 2026 9:50 AM

ఫ ఎండల్లో హాయ్‌ హాయ్‌

బామ్మ చెప్పిన నీతి కథ

వేసవి సెలవుల్లో మా బామ్మ నాకు,

మా చెల్లికి అనేక నీతి కథలు చెబుతూ మమ్మల్ని నిద్రపుచ్చేది. అందులో మాకు ఈ రెండు కథలు నచ్చాయి. వాటిని మీతో పంచుకుంటున్నాం.

నల్లగొండ : చీమలు దూరని చిట్టడవిలో తిమ్మరాజు అనే జిత్తులమారి నక్క ఉండేది. అసలు కష్టపడకుండా మిగతా జంతువులను మోసం చేస్తూ కాలం గడిపేది. దాని మోసాన్ని గ్రహించిన మిగతా జంతువులు దానికి ఆహారం దక్కకుండా చేశాయి. కష్టపడడం చేతగాని ఆ నక్క ఆకులు తింటూ ఉండేది. కొన్నాళ్లకు బక్కచిక్కిపోయి నడవలేని స్థితికి వచ్చింది. ఒక రోజు ఆ మార్గంలో వెళ్తున్న పిల్లికి బక్కచిక్కిన నక్క కనిపించింది. అదేంటి నక్క బావా ఇలా బక్కచిక్కిపోయావు అని నక్కను పిల్లి అడిగింది. తన కష్టాన్ని చెప్పుకుంది నక్క. ఈ దగ్గరలో ఒక విందు ఉంది నేను వెళ్తున్నాను. నువ్వు వస్తే ఎవరి కంటపడకుండా కడుపునిండా తిని వద్దాం అని సలహా ఇచ్చింది. పిల్లితో వెళ్లిన నక్క అక్కడ ఆహారాన్ని కడుపునిండా తిని.. పిల్లిని ఇంటివాళ్లకు పట్టించాలనే ఉద్దేశంతో పెద్దగా ఊల పెట్టింది. ఇంతలో ఇంటి వాళ్లు వచ్చి పిల్లిని, నక్కను బంధించారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న పిల్లి ప్రాణాలతో బయటపడింది. పుష్టిగా తిన్న నక్క పరుగుపెట్టలేక వారి చేతిలో చావుదెబ్బలు తిన్నతి.

నీతి : మంచి చేసే వారికి చెడు తలపెట్టాలని చూస్తే మనకే చెడు జరుగుతుంది.

– మాయ్‌రా విఖార్‌, 4వ తరగతి, మాంట్‌ఫోర్ట్‌ స్కూల్‌, నల్లగొండ

ఐకమత్యమే మహా బలం

నల్లగొండ : ఒక ఊరి చివర పచ్చని మైదానంలో నాలుగు ఆవులు ఎంతో స్నేహంగా ఉండేవి. కలిసి గడ్డి మేయడం, కలిసి తిరగడం చేసేవి. ఇవి ఎప్పుడూ కలిసి మెలసి గుంపులుగా ఉండేవి. కాబట్టి పులి, సింహాలు వీటి జోలికి రాకపోయేవి. కొంత కాలానికి ఏదో విషయంలో వాటి మధ్య దెబ్బలాట జరిగి నాలుగు ఆవులు నాలుగు వైపులా గడ్డి మేయడానికి వెళ్లాయి. ఇదే సరైన సమయమని పులి, సింహం పొదల్లో దాక్కొని ఒక్కొక్క ఆవును దానిని చంపి తిన్నాయి.

నీతి : మనం ఐకమత్యంగా ఉంటే ఎవరూ మనల్ని ఏమీ చేయలేదు. ఎప్పుడైతే మన ఐకమత్యం దెబ్బతింటుందో మన బలం తగ్గుతుంది.

– జాయ్‌రా విఖార్‌, 2వ తరగతి, మాంట్‌ఫోర్ట్‌ స్కూల్‌, నల్లగొండ

Advertisement
 
Advertisement
Advertisement