నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణంలో మామిడి పండ్లు విక్రయిస్తున్న బండ్లు, వాహనాలను మంగళవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల సందర్భంగా మామిడి పండ్లు మగ్గుబెట్టేందుకు వ్యాపారులు గోల్డ్ రైప్, ఎన్ రైప్ వంటి ఇథిలీన్ గ్యాస్ విడుదల చేసే సాచెట్లను వినియోగిస్తున్నట్లు గుర్తించామని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్. శివశంకర్‌రెడ్డి తెలిపారు. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా ఇథిలీన్ వినియోగం అనుమతించబడిన విధానమని తెలిపారు. రెండు మామిడి పండ్లను సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపినట్లు వివరించారు.


