గ్రంథాలయాల పుస్తకాలను వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

గ్రంథాలయాల పుస్తకాలను వినియోగించుకోవాలి

May 16 2026 6:27 AM | Updated on May 16 2026 6:27 AM

చౌటుప్పల్‌ : గ్రంథాలయాల్లోని పుస్తకాలను నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ఉపయోగించుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలోని శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను అదనపు కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడారు. గ్రంథాలయంలోని పుస్తకాలను వినియోగించుకుని పోటీ పరీక్షల్లో రాణించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పలువురిని ఆయన సత్కరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మొగుదాల పావనిరమేష్‌గౌడ్‌, కమిషనర్‌ వెంకటేశ్వరనాయక్‌, గ్రంథాలయ కార్యదర్శి సుధీర్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జిల్లా గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన

భువనగిరిటౌన్‌ : విద్యా వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఎండీ అవైస్‌ ఉర్‌ రెహ్మాన్‌ చిస్తీ మాట్లాడుతూ.. గ్రంథాలయంలో ఉన్న వివిధ పోటీ పరీక్షల పుస్తకాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచేందుకు ప్రతి పాఠశాల నుంచి వారానికి ఒకరోజు గ్రంథాలయ సందర్శన ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఈ ఓ సత్యనారాయణరావు, మున్సిపల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఎంఈఓ నాగార్జునరెడ్డి, వైస్‌ చైర్మన్‌ మంజుల, కౌన్సిలర్‌ బొంతల నర్సింగ్‌ పాల్గొన్నారు.

ఫ స్థానిక సంస్థల అదనపు

కలెక్టర్‌ భాస్కర్‌రావు

Advertisement
 
Advertisement
Advertisement