భువనగిరిటౌన్ : ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తరుగు పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రాలలో తరుగుపేరిట ధాన్యంలో కోత విధించడాన్ని నిరసిస్తూ గురువారం భువనగిరి పట్టణ శివారులోని తుక్కాపూర్ ఎక్స్‌రోడ్డు వద్ద నల్లగొండ– భువనగిరి రహదారిపై ధాన్యం బస్తాలు పెట్టి రైతులు ధర్నా చేశారు. దీంతో కిలోమీటర్‌మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కష్టపడి వస్తే మిల్లర్లు, దళారులు కుమ్మకై ్క తాలు పేరుతో బస్తాకు 2 నుంచి 5 కిలోల వరకు కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తేమ శాతం సాకుతో క్వింటాకు భారీగా నష్టం కలిగిస్తున్నారని, తూకం వేసిన ధాన్యాన్ని తరలించడానికి లారీలు కూడా రాకపోవడంతో రోజుల తరబడి కేంద్రాల వద్దే నిద్రపోవాల్సి వస్తోందని వాపోయారు. తుక్కాపూర్ గ్రామ సర్పంచ్, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు ఆధ్వర్యంలో నిర్వహించారు. ధర్నా వద్దకు భువనగిరి తహసీల్దార్ జగన్‌మోహన్‌ప్రసాద్, పట్టణ ఇన్‌స్పెక్టర్ రమేష్‌కుమార్ వద్దకు వచ్చి రైతులకు సర్ది చెప్పడంతో ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నోముల మహేందర్ రెడ్డి, పుట్ట వీరేష్ యాదవ్, రాసాల మల్లేష్, సత్యనారాయణ గౌడ్, లింగస్వామి యాదవ్, సుధాకర్ రెడ్డి, రాజమోహన్, బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
ఫ రైతుల ఆగ్రహం
ఫ భువనగిరి శివారులో రోడ్డుపై ధాన్యం బస్తాలు పెట్టి ధర్నా


